»Anand Mahindras Tweet On Araku Coffee Given To Leaders At The G20 Summit Has Gone Viral
Araku coffee: భారత్‌కు గర్వకారణం అరకు కాఫీ..ఆనంద్ మహీంద్రా పోస్ట్ వైరల్
జీ20 సదస్సులో పాల్గొన్న అతిథులకు అరకు కాఫీని బహుమతిగా ఇవ్వడం తానకెంతో గర్వకారణంగా ఉందని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Anand Mahindra's tweet on Araku coffee given to leaders at the G20 summit has gone viral
Araku coffee: భారతదేశంలో(bharat) ఉన్న అనేక విలువైన వాటిలో అరకు కాఫీ(Coffee) ప్రధాన వరుసలో ఉంటుంది. అది వారసత్వ సంపద కాకపోయినా..మన దగ్గరపండే నాణ్యమైన కాఫీ బీన్స్ ప్రపంచంలో ఏ దేశంలో కూడా లభించవు. ప్రస్తుతం దీనిపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా(Anand Mahindra) తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అరకు కాఫీ నాణ్యత, గొప్పదనం గురించి చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ సంవత్సరం మన దేశంలో జీ20 సదస్సు జరిగిన విషయం అందరికి తెలిసిందే. ఈ సమ్మిట్‌కు విచ్చేసిన విదేశీ అతిథులకు కేంద్రం ఇచ్చిన బహుమతుల్లో అరకు కాఫీ కూడా ఉంది. దీనిపై స్పందించిన ఆనంద్ తనకెంతో గౌరవంగా ఉందని పేర్కొన్నారు. విదేశీయులకు మన దేశ సాంస్కృతిక వారసత్వం ఎంత గొప్పదో తెలియజెప్పే ప్రయత్నంలో అరకు కాఫీతోపాటు, చేతితో చేసిన కళాఖండాలను కలిపి వారికి బహుమతిగా అందించారని గుర్తు చేశారు.
భారత్‌లో అత్యుత్తమ నాణ్యమైన ఉత్పత్తులలో అరకు కాఫీ ఉన్నందుకు ఆనంద్ మహీంద్రా గర్వపడుతున్నట్లు పోస్ట్ చేశారు. అరకు ఒరిజినల్స్ బోర్డ్ ఛైర్మన్ ఎంపికపై తాను వాదించలేను. కానీ ఆ గిఫ్ట్‌లో కాఫీ బీన్స్ ఉన్నందుకు తానెంతో సంతోషంతో ఉన్నారని పేర్కొన్నారు. ఈ బీన్స్ ప్రపంచంలోనే అత్యుత్తమమైనవి అని ఆయన రాసుకొచ్చారు. అరకులో సహజ సిద్ధంగా పండించిన కాఫీ రకానికి ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు లభిస్తోంది. దీన్ని మరింత ప్రోత్సహించేందుకు వీలుగా దీన్ని విదేశీ అతిథుల కానుకల జాబితాలో చేర్చారు. అరకు గ్లోబల్ హోల్డింగ్స్ ను భారత పారిశ్రామికవేత్తలైన ఆనంద్ మహీంద్రా, క్రిస్ గోపాలకృష్ణన్, డాక్టర్ రెడ్డీస్ చైర్మన్ సతీష్ రెడ్డి, సోమా ఎంటర్ ప్రైజెస్ చైర్మన్ రాజేంద్ర ప్రసాద్ మాగంటి ఏర్పాటు చేశారు.