ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ (TSRTC) గుడ్న్యూస్ చెప్పింది. చిల్లర సమస్యకు చెక్ పెట్టేందుకు బస్సుల్లో ఇక యూపీఐ పేమెంట్ సౌకర్యం కల్పించనుంది. ఇందుకోసం ఐ టిమ్స్ పరికారాలను బస్సుల్లో అందుబాటులోకి తీసుకురాన్నాది. బస్సుల్లో చిల్లర విషయంలో కండక్టర్ ప్యాసింజర్ మధ్య అనేక సార్లు గొడవలు జరిగాయి. ఇటివంటి సంఘటనలను అరికట్టడం కోసం టీఎస్ఆర్టీసీ ఆన్లైన్ పేమెంట్స్ (Online Payments) సౌకర్యం కల్పించాలని నిర్ణయించింది.
కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు టికెట్లపై రాయితీలు కూడా ప్రకటిస్తోంది. తొలుత పైలట్ ప్రాజెక్టుగా బండ్లగూడ డిపో (Bandlaguda Depot) పరిధిలోని ఆర్టీసీ బస్సుల్లో ఆన్లైన్ పేమెంట్ అవకాశం కల్పించనున్నారు. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి తీసుకురానున్నారు. సిటీ ఆర్డినరీ, పల్లెవెలుగు, మెట్రో బస్సుల్లోనూ అందుబాటులోకి తీసుకురానున్నారు. యూపీఐ (UPI) యాప్లతో పాటు డెబిట్, కార్డుల ద్వారా టికెట్ కోసం పేమెంట్ చేయవచ్చు.
బస్సుల్లో టికెట్ తీసుకునేటప్పుడు చిల్లర సమస్య (Retail problem) ఏర్పడుతుంది.ఈ క్రమంలో చిల్లర సమస్య లేకుండా చేసేందుకు ఆన్లైన్ నగదు లావాదేవీలను ప్రోత్సహించాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ఎప్పటినుంచో దీని గురించి చర్చలు జరుగుతుండగా.. ఇప్పుడు బస్సుల్లో అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇప్పటికే టికెట్ రిజర్వేషన్ కౌంటర్ల (Reservation counters) ద్వారా ఆన్లైన్ పేమెంట్స్ సౌకర్యం గతంలో అమల్లోకి తెచ్చింది. ఇప్పుడు అదే విధానం బస్సుల్లో కూడా తీసుకురానుంది.