penguins marchలో తేడా గమనించారా..? ఆనంద్ మహీంద్రా వీడియో షేర్
సోషల్ మీడియాలో ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర యాక్టివ్‌గా ఉంటారు. మండే మోటివేషన్స్ అని పెంగ్విన్ల మార్చ్‌కు సంబంధించి వీడియో పోస్ట్ చేశారు. అందులో తేడా గమనించారా అని అడిగారు.
Anand Mahindra:సోషల్ మీడియాలో ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర (Anand Mahindra) యాక్టివ్‌గా ఉంటారు. రోజు ఏదో ఒక వీడియో పోస్ట్ చేస్తుంటారు. తాజాగా మండే మోటివేషన్స్ (monday motivations) అని.. పెంగ్విన్ల (penguins) మార్చ్‌కు సంబంధించి వీడియో పోస్ట్ చేశారు. అందులో తేడా గమనించారా అని అడిగారు. ఒకసారి చూస్తే.. అర్థం కాదు.. రెండోసారి చూస్తే తేడా కచ్చితంగా గుర్తిస్తారు. ఆ తేడా ఏంటో తెలుసుకోవాలని ఉందా..? అయితే ఈ స్టోరీ చదవండి.
ఆ వీడియోకు (video) మండే మోటివేషన్ అనే హ్యాష్ ట్యాగ్ ఇచ్చి పోస్ట్ చేశారు. ఆ పెంగ్విన్‌లో (penguins) ఒకటి డిఫరెంట్‌గా ఉంటుంది. అన్నీ లేచి క్రమ పద్దతిలో నడుస్తున్నాయి. ఒకటి మాత్రం పొట్టతో దొర్లుతూ ముందుకు సాగుతుంది. నలుగురి దృష్టిలో పడాలంటే డిఫరెంట్‌గా ఆలోచించాలని కోరారు. ఆ వీడియోకు (video) నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. విభిన్నంగా ఆలోచిస్తే విజయాలు సొంతం అవుతాయని పలువురు రాశారు.
విజయాన్ని చేరుకునే దారి సంక్లిష్టంగా ఉంటుందని.. ఇందుకోసం కష్టపడి పనిచేయాల్సి ఉంటుందని ఆనంద్ మహీంద్రా (anand mahindra) పేర్కొన్నారు. గుంపులో ఒకరిగా ఉండటం కాదని.. విజయం దక్కించుకొని, అనుకున్నది సాధించేందుకు భిన్నంగా ఆలోచించాలని కోరారు.
ఆ వీడియోకు (video) పలువురు నెటిజన్లు కామెంట్ చేశారు. మీరు చెప్పింది 100కు వంద శాతం నిజం అన్నారు. భిన్నంగా ఆలోచిస్తే ప్రత్యేకంగా నిలబడటానికి ప్రభావం చూపిస్తోంది. మరో యూజర్ ఆ పెంగ్విన్లకు థార్ (thar) కారు సాయం చేస్తుందా అని అడిగారు.
These Penguins are marching in a regimented manner, one after the other with a similar gait. But which one did you notice? The one sliding along on its belly, I would bet. If you want to get noticed, think differently. #MondayMotivationpic.twitter.com/TFxorCsU3T