»A Publicity Stunt Profits With A Broom Calories Melt Away
Broomstick: చీపురుతో లాభాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?
ఓ చీపురు కంపెనీ గొప్ప స్ట్రాటజీ ప్రదర్శించింది. క్యాలరీ చాట్ ఉన్న ప్యాకింగ్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఆ చీపురు పట్టి మీ ఒంటిలో ఉన్న క్యాలరీలు తగ్గించుకోవాలని కోరుతుంది.
A publicity stunt, profits with a broom. Calories melt away
Broom: ఎంత మంచి ప్రొడక్ట్స్ అయినా వాటికి తగినా ప్రచారం లేకపోతే పెద్దగా వినియోగ దారులకు చేరవు. ఓ కంపెనీ చీపురుకు వినూత్న ప్రమోషన్ కల్పించింది. అందరి ఇళ్లలో ఉండే వస్తువుల్లో చీపురు ఒకటి. ఇందులో ఏముంది పబ్లిసిటీ చేసుకోవడానికి అంటారా.. అయితే ఈ కథనం చదవండి. ఓ వ్యక్తి దీనికి సంబంధించిన పోస్ట్ ట్విట్టర్లో షేర్ చేశారు. ఆ పోస్ట్ విపరీతంగా చక్కర్లు కొడుతుంది. పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తుంది. చీపురు ప్యాకింగ్ క్యాలరీ చాట్ వేశారు. ఒకసారి చీపురును వాడితే 150 క్యాలరీలు ఖర్చు అవుతాయని చెప్పింది.
ఈ హడావిడి లైఫ్‌లో చాలా మంది వాక్యూమ్ క్లీనర్ వాడుతున్నారు. క్యాలరీ చాట్ ఉన్న ప్యాకింగ్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చి ప్రజలను ఆకర్షిస్తోంది. చీపురు స్టిక్‌లో ఒక్కో సర్విసింగ్ కు 150 క్యాలరీలు ఉన్నాయని, కొవ్వును కరిగిస్తుంది అని పేర్కొంది. కంపెనీ తెలివి తేటలకు నెటిజనులు నవ్వుతున్నారు. నిజానికి చీపుర్లను సరిగ్గా ఉపయోగిస్తే క్యాలరీలు తగ్గుతాయని చాలామంది నిపుణులు సూచిస్తున్నారు.