»Viral Video Japan Sushi Chain Rs 946 Crore Loss To Restaurant Due To Boys Act
Viral Video-Japan Sushi Chain: బాలుడు చేసిన పనికి రెస్టారెంట్‌కు రూ.946 కోట్ల నష్టం
ఓ బాలుడు రెస్టారెంట్లో చేసిన పని వల్ల ఆ రెస్టారెంట్‌కి రూ.946 కోట్లు నష్టం వచ్చింది. ప్రస్తుతం ఆ బాలుడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఓ బాలుడు రెస్టారెంటు(Restaurant)కి వెళ్లి కుదురుగా ఉండలేదు. 30 క్షణాల్లో ఆ పిల్లాడు చేసిన పనికి ఆ రెస్టారెంట్‌కు రూ.946 కోట్ల నష్టం వచ్చింది. ఆ బాలుడు రెస్టారెంట్‌కు వెళ్లి సోయా సాస్(soya saus) బాటిల్ మూత తెరిచాడు. దానిని నాకి మళ్లీ టేబుల్ పై పెట్టాడు. అంతటితో ఆగకుండా అక్కడున్న టీ కప్పుల(Tea Cups)ను కూడా తీసుకుని నాలుకతో తాకుతూ వాడి లాలాజలం అంటించేశాడు. నోటిలో తన వేలును పెట్టుకుని తీసి ఆ తర్వాత మిగిలిన ఆహార పదార్థాలపై ఆ వేలును ఉంచాడు.
బాలుడు ఈ పనులన్నీ చేస్తుంటే అక్కడే ఉన్న మరో వ్యక్తి వీడియో తీశాడు. ఆ వీడియో వైరల్(Video Viral) అవ్వడంతో రెస్టారెంట్లో అమ్మకాలన్నీ పడిపోయాయి. జపాన్‌లోని సుషీ రెస్టారెంట్(Japan Sushi Chain Restaurant)కు చెందిన ఓ ఫ్రాంచైజ్ బ్రాంచ్‌లో ఈ సంఘటన జరిగింది. ఈ వీడియోను జనవరి 29న నెట్టింట పోస్టు చేయడంతో ఆ బాలుడిపై రెస్టారెంట్ బ్రాంచ్(Restaurant Branch) రూ.3.95 కోట్ల దావా వేసింది. దీంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.
ఆ బాలుడు చేసిన పనికి సుషీ కంపెనీకి దాదాపు రూ.946 కోట్ల నష్టం వచ్చినట్లు తన దావాలో పేర్కొంది. ఈ ఘటన వల్ల ఆ రెస్టారెంటు బ్రాంచ్(Restaurant Branch)లో అనేక చర్యలు చేపట్టింది. సీసీ కెమెరాల సంఖ్య పెంచింది. కప్పులు, ఇతర వస్తువులపై ప్లాస్టిక్ కవర్లు ఉంచింది. ఈ విషయంలో ఆ బాలుడు కూడా స్పందించి తన తప్పును ఒప్పుకున్నాడు. తనపై వేసిన దావాను కొట్టివేయాలని కోర్టుకు విన్నవించుకున్నాడు. తాను, తన ఫ్రెండ్ కలిసి ప్రాంక్ వీడియో తీశామని, అది థర్ట్ పార్టీకి పంపితే ఇలా వైరల్ అయినట్లు బాలుడు కోర్టుకు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్(Viral) అవుతోంది.