ఎక్కడైనా డబ్బులు, బంగారం దొంగతనం చేస్తారు. లేదంటే ఏదైనా వస్తువులను దొంగతనం చేస్తుంటారు. కానీ ఇక్కడ మాత్రం ఏకంగా నిర్మాణంలో ఉన్న రోడ్డునే దొంగతనం చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈమధ్యకాలంలో దొంగతనాలు విపరీతంగా పెరిగిపోయాయి. వాటికి సంబంధించిన వార్తలు నిత్యం సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతుంటాయి. కొన్నిసార్లు షాకింగ్ దొంగతనాలు కూడా జరుగుతుంటాయి. ఒక్కోసారి చోరీ చేసిన వీడియోలను చూస్తే అవాక్కవ్వడం ఖాయం. తాజాగా ఇలాంటి దొంగతనమే ఒకటి జరిగింది. ప్రస్తుతం ఈ దొంగతనం గురించి సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ (Video viral) అవుతోంది.
వైరల్ అవుతోన్న వీడియో:
बिहार में लोगों ने मुख्यमंत्री की सड़क ही लूट ली!
जहानाबाद के मखदूमपुर के औदान बीघा गांव में मुख्यमंत्री सड़क ग्राम योजना के तहत सड़क बनाई जा रही थी. दावा है कि ढलाई के समय लोग पूरा मटेरियल ही लूट ले गये. बताया जा रहा कि इससे पहले भी ये सड़क ऐसे ही लूट ली गई थी. (@AdiilOfficial) pic.twitter.com/ZCBiStXr5Y
నిర్మాణంలో ఉన్న రోడ్డును గ్రామస్తులు దొంగిలించారు. ఈ షాకింగ్ చోరీ ఘటన బీహార్ రాష్ట్రంలోని జెహనాబాద్‌లో చోటుచేసుకుంది. జహనాబాద్ లోని మఖద్దుంపూర్లో ఔదానా భేగా అనే గ్రామం ఉంది. ఈ గ్రామానికి ముఖ్యమంత్రి గ్రామ సడక్ యోజన కింద రహదారిని నిర్మిస్తున్నారు. గ్రామంలోకి వచ్చిన కాంట్రాక్టర్ కార్మికులతో కాంక్రీట్ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. గ్రామంలో ఏయే భాగాల్లో కాంక్రీటు వేయాలో గుర్తించి ఆ ప్రాంతంలో పనులు చేపట్టారు. కాంట్రాక్టర్ సమక్షంలో అతి తక్కువ సమయంలోనే రోడ్డును పూర్తి చేశారు.
పనులు పూర్తయిన తర్వాత అక్కడి నుంచి కాంట్రాక్టర్, కార్మికులు వెళ్లిపోయారు. అయితే ఆ తర్వాతే అక్కడ జరగాల్సింది అంతా జరిగిపోయింది. గ్రామస్తులంతా కలిసి నిర్మాణంలో ఉన్న రోడ్డును లూటీ చేశారు. కొత్తగా వేసిన కాంక్రీటు రోడ్డు మొత్తాన్ని గ్రామస్తులు క్షణాల్లోనే ఖాళీ చేసేశారు. ఆ సీన్ చూసిన కాంట్రాక్టర్ ఒక్కసారిగా బిత్తరపోయి బిక్కుబిక్కుమన్నాడు. రోడ్డు మొత్తాన్ని గ్రామస్తులు దొంగిలించారని గమనించి ఇక చేసేదేమీ లేక అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ప్రస్తుతం కాంక్రీటు రోడ్డు దొంగిలించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.