Klin Kaara konidela: రామ్ చరణ్-ఉపాసన దంపతుల కూతురి పేరును మెగా ఫ్యామిలీ ప్రకటించింది. క్లింకారా కొణిదెల అని వెల్లడించింది. చెర్రీ-ఉపాసనల కూతురి పేరును మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. క్లింకారా అంటే ఏంటో అర్థం కూడా చెప్పారు. లలిత సహస్రనామం నుంచి తీసుకున్నానని తెలిపారు. ఆధ్మాత్మిక మేల్కొలుపును కలిగించే పరివర్తన శుద్ధి చేసే శక్తిని సూచిస్తోందని రాసుకొచ్చారు. పైన చెప్పిన లక్షణాలను లిటిల్ ప్రిన్సెస్ పుణికి పుచ్చుకుంటుందని ఆశించారు. ఆమె పెరిగే కొద్దీ తన పేరును సార్థకం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
— Chiranjeevi Konidela (@KChiruTweets) June 30, 2023
చిరంజీవి ఇంట్లో జరిగిన వేడుకకు కొద్దీమంది సన్నిహితులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. చిరంజీవి దంపతులు- వారి వియ్యంకులు కలిసి క్లింకారాను తోట్లలో వేసి ఊపారు. రామ్ చరణ్ ఉపాసన దంపతులకు 11 ఏళ్ల క్రితం పెళ్లి అయ్యింది. ఇటీవల ఉపాసన అమ్మాయికి జన్మనిచ్చింది. దీంతో మెగా ఇంట్లో సంబురాలు నెలకొన్నాయి.
And the baby’s name is ‘Klin Kaara Konidela ‘..
Taken from the Lalitha Sahasranamam .. the name ‘Klin Kaara’ .. signifies a transformative purifying energy that brings about a spiritual awakening!