ఎయిర్‌పోర్ట్‌లోకి భారీగా వరద నీరు చేరింది. మోకాల్లోతు నీటిలో విమానాలు మునిగిపోయాయి. విమానాశ్రయం మొత్తం ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. దీంతో ఎస్క్‌లేటర్లు సైతం పనిచేయకుండా ఆగిపోయాయి. ఈ సంఘటన జర్మనీలో చోటుచేసుకుంది.
ఓ యువతి చేతిలో గన్‌తో రోడ్డుమీద వెళ్తుంది. ముందుకు వస్తున్న వాహనాలను గురిపెట్టింది. రోడ్డు దాటుతూ తనకు తానే గురిపెట్టుకుంది. ఇంతలో పోలీసు కారు తనను ఢీ కొట్టి.. యువతి తేరుకునేలోపే పోలీసుల చేతిలో బందీ అయింది. అసలు ఏం జరుగుతుందో తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.
మానసిక క్షోభ(mental health) వల్ల మన ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే అవి ఆరోగ్యంపై ఎలా ప్రభావితం అవుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం.
శ్రావణం మాసం రాగానే పూజలు, వ్రతాలు, నోములు అందరు చేస్తారు. కానీ అలా చేయడానికి సరైన పద్దతిని అధ్యాత్మికవేత్త శివ ప్రసాద్ ప్రేక్షకుల కోసం హిట్ టీవీతో చక్కగా వివరించారు. అలాగేే నాగుల చవితి, పంచమి, షష్టి ఈ మూడు రోజులకు ఉండే విశిష్టత ఏంటో చెప్పారు.
జనగామ బీఆర్ఎస్ నేతలు టూరిజం ప్లాజా ఉన్నారు. హై కమాండ్ పిలిచిందని.. పనుల కోసం వచ్చామని చెప్పారు. ఇంతలో అక్కడికి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి వచ్చారు. దీంతో అక్కడున్న నేతలు అంతా ఆశ్చర్యపోయారు.
చిరతను వేటాడిన కొండముచ్చులు. ఐక్యమత్యమే మహాబలము అని ఈ బబూన్స్ మరో సారి నిరూపించాయి. ఆకలి తీర్చుకుందామని దాడి చేసిన చిరత బతుకు జీవుడా అంటూ పరుగుపెట్టిన దృష్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
అన్‌కన్‌ఫ్యూజ్ మి విత్ బిల్ గేట్స్ పేరుతో బిల్ గేట్స్ ప్రముఖులను ఇంటర్వ్యూ చేస్తున్నారు. రెండో ఎపిసోడ్‌లో ఎన్జీవో సంస్థ ఖాన్ అకాడమీ వ్యవస్థాపకుడు సాల్ ఖాన్‌తో మాట్లాడారు. సల్మాన్ ఫోటో చూపిస్తూ.. ఇతని గురించి మీకు తెలుసా..? ఇతని పేరు వల్ల మీరు ఇబ్బందికి గురయ్యారా అని అడిగారు.
ఆగస్టు 15న ఖుఫీ మూవీ మ్యూజికల్ కాన్సెర్ట్ జరిగింది. ఈ వేడుకలో భాగంగా హీరోయిన్ సమంత, హీరో విజయ్ దేవరకొండ స్టేజ్‌పై లైవ్ పర్ఫార్మెన్స్ చేశారు. దీనిపై సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోంది. హద్దులు దాటి డ్యాన్స్ చేశారని ట్రోల్స్ చేస్తున్నారు.
ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. నిత్యం రద్దీగా ఉండే ప్రదేశంలో భవనం కూలింది. ఈ ఘటనలో ఐదు మంది మరణించగా 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భవనంపై కోతులు తిరగడమే ఇందుకు కారణం అని తెలుస్తోంది.
పాలమూరు పోలీసులు అతి చేస్తున్నారని.. తమ పార్టీ అధికారంలోకి వస్తే వడ్డీతో సహా చెల్లిస్తామని అంటున్నారు టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గుడ్డ లూడదీసి మరీ కొడతాం అని చెబుతున్నారు.
గదర్2 మూవీ థియేటర్లో ప్రదర్శితం అవుతుండగా ఓ వ్యక్తి పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినదించారు. దీంతో అక్కడున్న ప్రేక్షకులు ఆ వ్యక్తిని చితకబాదారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.