ఈ మధ్యకాలంలో భార్యాభర్తల (husband and wife) మధ్య చిన్న చిన్న సమస్యలకే పెద్ద పెద్ద గొడవలు జరగడం సాధారణంగా మారిపోయింది. చిన్న మాట కు వాగ్వాదానికి దిగడం అనేది భార్యాభర్తలిద్దరికీ ఒక అలవాటుగా మారిపోయింది. ఆ తర్వాత సర్దుకుని మామూలుగా ఉండడం ప్రస్తుత సమాజంలో జరుగుతున్న విషయం. కొన్ని తప్పులను చూసి చూడనట్లు సరేలే అనుకుని కొంతమంది భార్య భర్తలు వదిలేస్తుంటారు. కానీ ఒక మహిళ మాత్రం తన భర్తను రైల్వే స్టేషన్(Railway station)లో అందరి ముందే చితక్కొట్టింది. గొడవలన్నీ ఇంట్లో నాలుగు గోడల మధ్యకే పరిమితమవుతుంటాయి.
కొందరు బహిరంగంగానే గొడవలు (quarrels) పడుతుంటారు. చాలా సందర్భాల్లో భర్త భార్యను కొట్టడం, తిట్టడం కనిపిస్తుంది.ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతుంటాయి. తాజాగా సోషల్ మీడియా(Social media)లో ఓ వీడియో వైరల్‌గా మారింది. భర్తను ఓ భార్య రెజ్లింగ్ రింగ్‌లో మాదిరిగా భర్తను చితకొట్టేసింది. ఇందుకు రైల్వేస్టేషన్ వేదికైంది. ఈ వీడియోను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోను చూసిన పలువురు ఇదేం పెళ్లాంరా బాబోయ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియోను ఘర్ కా కాలేష్ (Ghar Ka Kalesh) అనే ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు.