»Five Killed In Building Collapse In Brindhawan Area Of Uttar Pradesh 10 People Were Injured
Tragedy: యూపీలో భవనం కూలి ఐదుగురు మృతి.. 11 మందికి గాయాలు
ఉత్తరప్రదేశ్లో దారుణం చోటుచేసుకుంది. నిత్యం రద్దీగా ఉండే ప్రదేశంలో భవనం కూలింది. ఈ ఘటనలో ఐదు మంది మరణించగా 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భవనంపై కోతులు తిరగడమే ఇందుకు కారణం అని తెలుస్తోంది.
Five killed in building collapse in Brindhawan area of Uttar Pradesh. 10 people were injured.
Tragedy: ఉత్తరప్రదేశ్( Uttar Pradesh)లోని బృందావనం(Brindhawan)లో ఓ భవనం కూలింది. ఈ ఘటనలో 5 మంది మరణించారు. ఈ విషాదఘటన బాంకే బిహారీ ఆలయ(Banke Bihari Temple) సమీపంలో చోటుచేసుకుంది. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో ఓ పురాతన భవనం ఉంది. దాని బాల్కనీ కూలడంతో ఈ విషాద(Tragedy) ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఈ దృష్యాలు స్థానికంగా కలవరం పుట్టిస్తున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు, రెస్క్యూ టీమ్(Police and rescue team) ప్రమాదం జరిగిన చోటుకు చేరకొని విచారణ చేపట్టారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..
సాధారణంగానే బృందావనంలోని బాంకే బిహారీ ఆలయం పరిసర ప్రాంతాలు రద్దీగా ఉంటాయి. నిరంతరం ఈ చోటుకి రాకపోకలు సాగుతుంటాయి. మంగళవారం రోజున ఈ ప్రాంతంలో ఓ భవనం బాల్కనీ ఒక్కసారిగా విరిగిపడింది. అందరూ భయబ్రాంతులకు గురయ్యారు. చాలా మంది అక్కడి నుంచి పరుగులు పెట్టారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. బాల్కనీ కిందపడిన వెంటనే భారీ శబ్దం వచ్చింది. ప్రజలు కేకలు వేస్తూ, అరుస్తూ పరుగులు పెట్టారు. ఏం జరిగిందో తెలిసేలోగా శిథిలాల కింద మనుషులు, వాహనాలు పడి ఉన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి వచ్చారు. వీరితో పాటు రెస్క్యూ టీమ్ వచ్చింది. సహాయక చర్యలు చేపట్టింది. ప్రమాదంలో చిక్కిన వారిని వెలికితీసి వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ దుర్ఘటనలో ఐదుగురు చనిపోయినట్లు డాక్టర్లు వెల్లడించారు. అయితే ఈ ఘటన జరిగినప్పుడు భవనంలోని బాల్కనీలో ఓ కోతుల జంట గొడవ పడుతుందని బృందావన్ ఎస్హెచ్ఓ విజయ్ కుమార్ సింగ్ తెలిపారు.
ఈ ప్రమాదంపై మధుర ఎస్ఎస్పి శైలేష్ కుమార్ పాండే స్పందించారు. ఘటనా ప్రదేశానికి సమీపంలోనే పోలీసులు ఉండడంతో హుటాహుటిన సహాయక చర్యలు అందాయని, లేదంటే మరణాలు పెరిగేవని పేర్కొన్నారు. మొత్తం ఘటనలో 11 మంది గాయపడ్డారని అందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని, ముగ్గురు మహిళలతో సహా మొత్తం ఐదుగురు మరణించినట్లు తెలిపారు.
VIDEO | A portion of an old building collapses near Banke Bihari Temple in Vrindavan. More details are awaited. pic.twitter.com/lRUd9H7GTr