»Flood Disaster At Frankfurt Airport In Germany Planes In Water
Floods: ఎయిర్‌ఫోర్ట్‌లో వరద బీభత్సం..నీట మునిగిన విమానాలు
ఎయిర్‌పోర్ట్‌లోకి భారీగా వరద నీరు చేరింది. మోకాల్లోతు నీటిలో విమానాలు మునిగిపోయాయి. విమానాశ్రయం మొత్తం ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. దీంతో ఎస్క్‌లేటర్లు సైతం పనిచేయకుండా ఆగిపోయాయి. ఈ సంఘటన జర్మనీలో చోటుచేసుకుంది.
Flood disaster at Frankfurt Airport in Germany.. Planes in water
Floods: ఎయిర్‌పోర్ట్‌లోకి వరద నీరు చేరడంతో ప్రయాణికులకు ఇక్కట్లు తప్పలేదు. మాములుగా రైల్వే స్టేషన్లు, బస్ స్టాపులలో ఇలాంటి దృష్యాలు కనిపిస్తాయి. అలాంటిది ఒక అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్‌లో ఇలా వరద నీరు రావడంతో ప్రయాణికులు ఆశ్చర్యపోయారు. అయితే దీనికి కారణం ప్లానింగ్ కరెక్ట్ లేకనో లేదా అధికారుల నిర్లక్ష్యమో కాదు. వర్షం బీభత్సం ఈ రేంజ్లో ఉంది. జర్మనీ (Germany)లో ఫ్రాంక్ఫర్ట్ (Frankfurt) నగరం భారీ వర్షాల (Heavy Rains)తో అతలాకుతలమైంది. పలు చోట్ల రహదారులు నదుల్లా మారాయి అంటే అతిశయోక్తి కాదు. ఒక గంటలోనే దాదాపు 25 వేలసార్లు మెరుపులు వచ్చాయంటే వర్ష తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. అక్కడి అంతర్జాతీయ విమానాశ్రయం (Frankfurt airport) పూర్తిగా నీటితో నిండిపోయింది. రన్‌వేపైకి భారీగా నీరు చేరి విమానాలు తేలియాడుతున్నట్లు కన్పిస్తున్నాయి. అటు ఎయిర్‌పోర్టులోని ఎస్క్‌లేటర్, దుకాణాల్లోకి భారీగా వరద చేరడంతో వ్యాపారులు ఆందోళన చెందారు.
బుధవారం రాత్రి నుంచి అక్కడ కుండపోత వర్షం పడుతుంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. జర్మనీ ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయమైన ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్‌పోర్టు (Frankfurt airport Flooded) వరదల్లో చిక్కుకోవడంతో ఇక్కడ సేవలు మొత్తం నిలిచిపోయాయి. ఇక్కడి నుంచి బయల్దేరే అనేక విమానాలను రద్దు చేశారు. ఎయిర్‌పోర్టుకు వచ్చే విమానాలను దారిమళ్లించారు. దీంతో వేలాది మంది ప్రయాణికులు ఎయిర్‌పోర్టులోనే పడిగాపులు కాస్తున్నారు. ఎయిర్పోర్ట్ రన్‌వేపైకి వరద చేరిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ (Viral Video)గా మారాయి.