ధమాకా, వాల్తేరు వీరయ్యతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నాడు మాస్ మహారాజా రవితేజ. అయితే ఇదే జోష్‌లో వచ్చిన రవితేజ నెగిటివ్ టచ్‌తో వచ్చిన 'రావణాసుర' సినిమా మాత్రం బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేసింది. అందుకే ఇప్పుడు ఆ లోటును పూడ్చేందుకు టైగర్‌గా ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు మాస్ రాజా. తాజాగా టీజర్ రిలీజ్ చేయగా.. అదిరిపోయింది.
ఫస్ట్ టైం రవితేజ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘టైగర్ నాగేశ్వర రావు’. స్టువర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వర రావు బయోపిక్ ఆధారంగా తెరెక్కుతున్న ఈ సినిమాకి వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకంపై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 20వ తేదిన విడుదల చేయనున్నారు. ఇప్పటికే మేకర్స్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. విడుదలైన ఫస్ట్ గ్లింప్స్‌కు సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక టీజర్ అనౌన్స్మెంట్ బయటికి రాగానే.. పులి బయటకి రానుంది, వేటకి సిద్ధమయ్యింది అంటూ మాస్ మహారాజా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు.
అందుకు తగ్గట్టే ఈ సినిమాపై మరిన్ని అంచనాలని పెంచేసేలా ఉంది టైగర్ నాగేశ్వర రావు టీజర్. టైగర్ దండయాత్ర పేరుతో బయటికొచ్చిన టీజర్.. మాస్ మహారాజా ఫ్యాన్స్‌తో విజిల్స్ వేయించేలా ఉంది. అతి దారుణంగా దోపిడీలు చేసిన స్టువర్టుపురం దొంగ మద్రాస్ జైలు నుంచి తప్పించుకున్న తర్వాత పోలీసులు ఆయనకు ఇచ్చిన ఎలివేషన్‌తో టీజర్‌ను గూస్ బంప్స్ వచ్చేలా కట్ చేశారు. నాగేశ్వర రావు పాలిటిక్స్‌లోకి వెళ్లి ఉంటే తెలివితేటలతో ఎలక్షన్ గెలిచేవాడు.
స్పోర్ట్స్‌లోకి వెళ్లుంటే వాడి పరుగుతో ఇండియాకు గోల్డ్ మెడల్ తెచ్చే వాడు. ఆర్మీలోకి వెళ్లి ఉంటే వాడి ధైర్యంతో ఒక యుద్ధమే గెలిచేవాడు కానీ అనుకోకుండా వాడొక క్రిమినల్ అయ్యాడు సార్.. పులి, సింహాలు ఒక వయసు వచ్చే వరకు పాలే తాగుతాయి.. కానీ వీడు మాత్రం ఎనిమిదేళ్లకే రక్తం తాగడం మొదలు పెట్టాడని.. హై ఓల్టేజ్ రేంజ్లో టీజర్‌ను కట్ చేశారు. ఇక రవితేజ లుక్ ఊరమాస్‌గా ఉంది. మాస్ రాజా ఫ్యాన్స్‌కు ఎలాంటి ఎలివేషన్ కావాలో.. అలాంటివి టైగర్ నాగేశ్వరరావులో దండిగా ఉన్నాయి. మొత్తంగా మాస్ మహారాజా ఈసారి పాన్ ఇండియా ఊచకోత మామూలుగా ఉండదని టీజర్‌తో చెప్పేశారు. మరి టైగర్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి.