»Alia Bhatt Explains Why Her Hollywood Debut Film Heart Of Stone Was Not Promoted
Alia Bhatt: రణబీర్‌కు లిప్‌స్టిక్ పెడితే నచ్చదట..?
బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనుసుదోచుకోవడమే కాదు ఏకంగా హాలీవుడ్ మేకర్స్ దృష్టిని ఆకర్షించింది. దీంతో ఓ సినిమా అవకాశాన్ని కొట్టేసింది. తన డెబ్యూ ఫిల్మ్ రిలీజ్ అయ్యింది.. కానీ ప్రమోషన్లో ఎక్కడ కనిపించలేదు. రీసెంట్గా నిర్వహించిన చిట్ చాట్‌తో ఫ్యాన్స్‌తో అసలు విషయాన్ని పంచుకుంది.
Alia Bhatt explains why her Hollywood debut film Heart Of Stone was not promoted
Alia Bhatt: బాలీవుడ్(Bollywood) బ్యూటీ అలియా భట్(Alia Bhatt) ఇటీవల హార్ట్ ఆఫ్ స్టోన్(Heart Of Stone) సినిమాతో హాలీవుడ్(Hollywood)లోకి అడుగుపెట్టింది. ఈ చిత్రం NetFlixలో ఈ నెల 11వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. అలియా ఆ మూవీలో నటించినట్లు చాలా మందికి తెలియదు. హాలీవుడ్లో సినిమా అవకాశం వస్తే నానా హంగామా చేయాల్సింది పోయి ఇంత సైలెంట్‌గా ఉండటంపై బీటౌన్‌లో చర్చ జరిగింది. ఇటీవల అభిమానులతో జరిగిన ఇంట్రాక్షన్లో తాను ఈ చిత్రానికి ఎందుకు ప్రమోషన్ చేయలేదనే విషయంపై అలియా భట్ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొంది.
హార్ట్ ఆఫ్ స్టోన్ (Heart Of Stone) ప్రమోషన్లో ఎందుకు వెళ్లలేదని ప్రశ్న రాగా.. హలీవుడ్ అంతా SAG-AFTRA సమ్మెలో ఉన్నందున ఆ సినిమాకు భారీ ప్రమోషన్లు చేయలేదని పేర్కొంది. ఒక జట్టుగా, మేము SAG-AFTRA సమ్మెకు మద్దతు ఇస్తున్నాము. ఆ సమ్మెకు సంఘీభావం తెలుపుతూ చిత్ర యూనిట్ ఆ మూవీని ప్రమోట్ చేయలేదని పేర్కొంది. తన భర్త రణ్‌బీర్ కపూర్‌కు తాను లిప్‌స్టిక్ పెడితే నచ్చదని పేర్కొంది. వారు డేటింగ్‌కి వెళ్లినప్పుడు లైట్‌గా లిప్‌స్టిక్ పెడితే తుడిచే వరకు ఊరుకునేవాడు కాదని, తనకు సహజమైన పెదాల రంగు అంటేనే ఇష్టమని తెలిపింది.
ఇక తన ఫ్యాన్స్‌ను ఉద్దేశించి.. అభిమానులు కురిపిస్తున్న ప్రేమను పొండడానికి తాను ఎప్పుడూ రెడీగా ఉంటానని, వారికోసమే మంచి సబ్జెట్లు చేస్తానని చెప్పుకొచ్చారు. SAG-AFTRA సమ్మె అనేది హాలీవుడ్‌లోని రచయితలు, నటులు కలిసి చేస్తున్న నిరసన. సినిమా స్క్రిప్ట్ రైటింగ్‌లో భాగంగా ఏఐ సహకారం తీసుకుంటున్నారని మే 2, 2023న రచయితల సమ్మె ప్రారంభమైంది. వెంటనే నటీనటుల సంఘం కూడా చేరింది. వీరు కలిసి జూలై 14, 2023 నుండి సమ్మె కొనసాగిస్తున్నారు. ఇలా ఇద్దరు కలిసి సమ్మెచేయడం 60 ఏళ్లలో ఇదే మొదటిసారి.