Britney Spears: స్టార్ సింగర్ డివొర్స్.. మొగుడు లేకపోతేనేం..? ఓ గుర్రాన్ని కొంటా
త్వరలో గుర్రం కొంటానని అమెరికా పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ కామెంట్ చేసింది. భర్తతో విడాకులు తీసుకోబోతున్న తరుణంలో గుర్రాన్ని కొనుగోలు చేస్తానని చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి.
Britney Spears: బ్రిట్నీ స్పియర్స్ (Britney Spears).. అమెరికా పాప్ సింగర్. ఆమె పాట అంటే కుర్రకారు పడి చస్తోంది. అంతలా ఫ్యాన్ ఫాలొయింగ్ ఉంది. గత ఏడాది ఆమె సామ్ అస్గారీని పెళ్లి చేసుకుంది. ఆ జంటకు ఏమైందో తెలియదు.. కానీ విడిపోతున్నామని ప్రకటించారు. విడాకుల కోసం అస్గారీ కోర్టులో పిటిషన్ వేశాడు. ఆ పిల్‌పై విచారణ జరగాల్సి ఉంది. అయితే బ్రిట్నీ స్పియర్స్ గుర్రం మీద ఉన్న ఓ ఫోటోను ఇన్ స్టాలో షేర్ చేసింది. బీచ్ ఒడ్డున ఆమె కూర్చొని ఉంది. ‘ఓ గుర్రం కొనాలని అనుకుంటున్నా.. కానీ తన ముందు చాలా ఆప్షన్స్ ఉన్నాయి అని’ చెబుతోంది.
‘త్వరలో ఓ గుర్రాన్ని కొనుగోలు చేస్తా.. తన మందు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఎంపిక చేయడం కష్టంగా ఉంది. సోపి, రోర్ అనే గుర్రాలు ఉన్నాయని పేర్కొన్నారు. తలపై టోపీ పెట్టుకున్న పింక్ కౌ బాయ్ తనకు కావాలి.. రోర్‌తో మధురమైన ప్రదేశాన్ని కనుగొంటా అని’ బ్రిట్నీ స్పియర్స్ (Britney Spears) రాసుకొచ్చారు.
బ్రిట్నీ స్పియర్స్‌తో (Britney Spears) కాంప్రమైజ్ కాలేక విడాకులు తీసుకోనున్నట్టు భర్త అస్గారీ పేర్కొన్నారు. బ్రిట్నీ స్పియర్స్ తన ఆస్తులను ప్రత్యేక ఆస్తిగా పెళ్లికి ముందే పేర్కొంది. సంతకాలు కూడా చేయించింది. ఆస్తులు, బాధ్యతల స్వభావం, పరిధిని నిర్ణయించలేదని.. వివిధ అంశాలు, ఆస్తులు, అప్పుల స్వభావం, పరిధి అస్గారికి తెలియదని కోర్టు అభిప్రాయపడింది.
బ్రిట్నీ(Britney)- అస్గారీ ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ జూన్ నెలలో జరిగింది. వారిద్దరూ కలిసి దిగిన ఫోటోలతో ఇన్ స్ట స్టోరీలో అస్గారీ షేర్ చేశారు. దానికి క్యాప్షన్‌గా ‘హ్యాపీ ఫస్ట్ ఇయర్ టు మి అండ్ మై బెటర్ హాఫ్’ అని రాశారు. వివాహా వార్షికోత్సవానికి యానివర్సరీకి ముందు బ్రిట్నీ తన ఇన్ స్ట అకౌంట్‌ను డీ యాక్టివేట్ చేసింది.