»Man Attacks 19 Year Old Girl Student With Koyta In Pune
Girlపై కత్తితో దాడి..? రోడ్డు మీద బీభత్సం, ఎందుకంటే..?
లవ్ బ్రేకప్ చెప్పిందని ఓ యువతిపై పగ తీర్చుకునేందుకు కత్తితో బయల్దేరాడు లక్ష్మణ్ అనే యువకుడు. అడ్డు వచ్చిన స్థానికులపై దాడి చేసి బీభత్సం సృష్టించాడు. పుణెలో ఘటన జరగగా.. ఆ వీడియో సోషల్ మీడియాలో ట్రోల్ అవుతోంది.
Man attacks 19-year-old girl student with Koyta in Pune
Girl: లవ్ బ్రేకప్ చెప్పిందని యువతిపై పగ పెంచుకున్నాడు. ఎలాగైనా సరే చంపాలని అనుకున్నాడు. సమయం చూసి దాడి చేశాడు. ఆ యువతి రెప్పపాటులో తప్పించుకుంది. ఈ ఘటన పుణెలో గల సదాశివ్ పేట్లో జరిగింది. దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగా తెగ వైరల్ అవుతోంది.
పుణెకు (Pune) చెందిన శాంతాను లక్ష్మణ్ జాదవ్ (Laxman), ప్రీతి రామచంద్ర (preethi) కాలేజీ రోజుల్లో లవ్ (love) చేసుకున్నారు. తర్వాత వారి మధ్య విభేదాలు వచ్చి విడిపోయారు. ప్రీతి అతనికి బ్రేకప్ చెప్పింది. దీంతో పగ పెంచుకున్న లక్ష్మణ్.. ఆమెను ఫాలో చేశాడు. రెక్కీ కూడా చేసినట్టు ఉన్నాడు. ఓ రోజు యువతి మరో స్నేహితుడితో కలిసి స్కూటీ మీద వస్తోంది. వారి వెనకాల వచ్చిన అతను.. మాట కలిపాడు. బైక్ మీద ఉన్న ప్రీతి (preethi) స్నేహితుడు చేయి వేసే ప్రయత్నం చేశాడు. మాట మాట పెరిగినట్టు ఉంది. ప్రీతి, ఆమె స్నేహితుడు స్కూటీ దిగేశారు. వెనక్కి వెళ్లిన లక్ష్మణ్.. తనతో తెచ్చుకున్న బ్యాగ్ నుంచి కత్తి తీశాడు.
ప్రీతి (preethi) స్నేహితుడితో గొడవ పడ్డాడు. భయపడి అతను పారిపోగా.. ప్రీతి వెంట పడ్డాడు. అతను దాడి చేయగా.. ఓసారి కిందపడింది. ఆ తర్వాత పైకి లేచి పరుగుతీసింది. వెంటనే స్థానికులు కూడా పరుగెత్తారు. లక్ష్మణ్ బారి నుంచి ఆ యువతిని కాపాడారు. అతనిని పట్టుకొని పోలీసులకు అప్పించారు. లక్ష్మణ్‌ను (laxman) పట్టుకునే క్రమంలో స్థానికులు ఇబ్బంది పడ్డారు. అతని దగ్గరికి వెళ్లే సమయంలో కత్తితో దాడి చేసే ప్రయత్నం చేయబోయాడు. అతని సమీపంలో ఉన్న వస్తువులను విసిరేశాడు.
లక్ష్మణ్‌పై (laxman) హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. లక్ష్మణ్ ప్రవర్తన గురించి అతని తండ్రికి తెలిపామని ప్రీతి తల్లి మీడియాకు తెలిపారు. అయినప్పటికీ ఫలితం లేదని.. ఈ రోజు తన కూతురిని చంపేందుకు ప్రయత్నించారని వాపోయింది. లక్ష్మణ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరింది.