»How About Putting Disclaimer Saying That Story Of Adipurush Is Ramayana Allahabad High Court Angry
Adipurush కథ రామాయణం అని చెప్పి డిస్‌క్లెయిమర్ వేస్తే ఎలా..? అలహాబాద్ హైకోర్టు ఆగ్రహాం
ఆదిపురుష్ మూవీ టీమ్‌పై అలహాబాద్ హైకోర్టు ధర్మాసనం ఆగ్రహాం వ్యక్తం చేసింది. సినిమాలో రాముడు, సీత, లక్ష్మణుడు, రావణుడి పాత్రధారులు ఉండి.. రామాయణం కథ కాదని అంటే జనం ఎలా నమ్ముతారని ప్రశ్నించింది.
How about putting disclaimer saying that story of Adipurush is Ramayana..? Allahabad High Court angry
Adipurush: ఆదిపురుష్ (Adipurush) మూవీ కథపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. రామాయణం కథ అని చెప్పి ప్రమోట్ చేశారు. తీరా మూవీ రిలీజ్ అయ్యాక రామాయణం కథ కాదు అని.. డిస్ క్లెయిమర్లో కూడా చెప్పానని సినిమా కథ రచయిత చెబుతున్నారు. దీనిపై వివాదం నెలకొంది. సినిమాను నిషేధించాలని అలహాబాద్ హైకోర్టులో పిటిషన్లు దాఖలు కాగా.. జస్టిస్ రాజేశ్ సింగ్ చౌహాన్, జస్టిస్ శ్రీ ప్రకాశ్ సింగ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఆదిపురుష్ (Adipurush) సినిమా హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని పిటిషనర్ల తరఫు న్యాయవాది రంజన్ అగ్నిహోత్రి వాదనలు వినిపించారు. ఇది వాల్మీకి రామాయణం కాదు.. తులసీదాసు రాసిన రామచరిత మానస్ కూడా కాదని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.
‘ఆదిపురుష్‌లో (Adipurush) కీలక పాత్రలను చిత్రీకరించిన తీరుపై ధర్మాసనం ఆశ్చర్యానికి గురయ్యంది. హిందువులు క్షమాగుణం ఉన్నవారు.. అలా అని ప్రతిసారీ వారి సహనాన్ని ఎందుకు పరీక్షిస్తారు..? సహనంతో ఉన్నారు కదా అని అణచివేతకు దిగడం సరైనదేనా..? అని’ అలహాబాద్ హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. ఆదిపురుష్ హిందీ మాటల రచయిత మనోజ్ ముంతశిర్‌ను కేసులో ఇంప్లీడ్ చేయాలనే సబ్ పిటిషన్‌కు ఆమోదం తెలిపింది. నోటీసులు జారీ చేయాలని పోలీసు శాఖను ఆదేశించింది. సినిమా ప్రారంభంలో రామాయణంతో సంబంధం లేదని వేసిన డిస్ క్లెయిమర్ను తోసిపుచ్చింది. రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు, రావణుడు, లంక అందరినీ చూపించి డిస్ క్లెయిమర్ ప్రదర్శిస్తే జనం ఎలా విశ్వసిస్తారని ప్రశ్నించింది.
ఆదిపురుష్ (Adipurush) మూవీకి కేంద్ర సెన్సార్ బోర్డు జారీచేసిన ధ్రువపత్రాన్ని పున:సమీక్షించే ఆలోచన ఏదైనా కేంద్ర ప్రభుత్వానికి ఉందా? ఆ సమాచారం తెలియజేయాలని డిప్యూటీ సొలిసిటర్ జనరల్ ఎస్బీ పాండేను ధర్మాసనం కోరింది. విసృత ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని 1952 చట్టంలోని సెక్షన్ 6 కింద తీసుకోవచ్చు. పున:సమీక్ష అధికారాలను ఉపయోగించి కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందా అనే విషయం తెలియజేయాలని పాండే కోరింది. తదుపరి విచారణను ఈ రోజు (బుధవారానికి) వాయిదా వేసింది.