Video: ప్రియుడితో ఏకాంతంగా భార్య.. పెళ్లి చేసిన భర్త
బీహార్ నవాడాలో ఓ వివాహిత ప్రియుడిని ఇంటికి పిలిపించుకుంది. ఇద్దరు ఏకాంతంగా ఉండగా.. కుటుంబ సభ్యులు పట్టుకొని కొట్టారు. ఆమె భర్త వారిని గుడికి తీసుకెళ్లి పెళ్లి జరిపించాడు.
Marriage: వివాహేతర సంబంధాల వల్ల జీవితాలు నాశనం అవుతుంటాయి. రెండు కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి. అయినప్పటికీ కొందరిలో మార్పు రావడం లేదు. తమ సుఖం కోసం బరి తెగిస్తున్నారు. ఇటీవల ఉత్తరప్రదేశ్లో ఘటన జరగగా.. ఇద్దరికీ పెళ్లి చేశారు. ఇప్పుడు బీహర్లో (bihar) కూడా ఓ భర్త అలానే చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియోలో షేర్ చేయగా వైరల్ అవుతుంది. కరెక్ట్ చేశావని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
నవాడాలో ఓ భార్య భర్తలు ఉంటున్నారు. వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఆ భార్య బుద్ది తప్పింది. మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్త (husband) ఇంట్లో లేని సమయంలో ప్రియుడిని పిలిపించుకుంది. వారిద్దరూ ఏకాంతంగా ఉండగా కుటుంబ సభ్యులు పట్టుకున్నారు. ఇద్దరిపై దాడి చేసి.. విషయం ఆమె భర్తకు చెప్పారు. వెంటనే వచ్చిన భర్త వారికి తగిన బుద్ది చెప్పాలని అనుకున్నాడు. వారిని ఆలయానికి (temple) తీసుకెళ్లి.. పెళ్లి చేశాడు. మరొకరు ఇలా చేయకుండా నిర్ణయం తీసుకున్నాడు.
ఆ వీడియోలో ప్రియుడు భుజం, ఎడమ కన్నుపై గాయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వివాహితకు కూడా దాడి చేశారు. నుదుటన తిలకం దిద్దాలని చెబుతుండగా అతను ఐదుసార్లు పెట్టాడు. ఆమె మాత్రం తనకు ఇష్టం లేదన్నట్టు ఏడుస్తూ కనిపించింది. ఆమె చేసిన తప్పు భర్త, పిల్లలకు దూరం చేసింది. మరొకరిని పెళ్లి చేసుకొని ఇంటి నుంచి వెళ్లిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. తన జీవితాన్ని ఆమెనే నాశనం చేసుకొంది. ఈ ఘటనతో మరొకరు ఇలాంటి తప్పుడు పనులు చేయకుండా ఉంటారని ఆ ఊరి పెద్దలు అంటున్నారు.