Hitech Mass Copying: ఏ పరీక్ష అయినా సరే కాపీయింగ్ చేస్తాం అంటాం కొందరు.. అందుకోసం టెక్నాలజీని కూడా వాడుతున్నారు. పుణెలో ఎస్ఆర్పీఎఫ్ ఎగ్జామ్ జరుగుతోంది. హాల్‌కు నలుగురు వచ్చారు. చక్కగా పరీక్ష రాస్తున్నారు. ఇంతలో ఇన్విజిలెటర్‌కు డౌట్ వచ్చింది. కొందరినీ చెక్ చేయగా హైటెక్ కాపీ (Hitech Mass) చేస్తున్నట్టు గుర్తించారు. వారిని అడగగా కాపీయింగ్ చేస్తున్నట్టు అంగీకరించారు.
ఎగ్జామ్ కాపీ (exam copy) చేసేందుకు చిన్న బ్లూ టూత్ వాడారు. అదీ చెవి లోపల పెట్టుకున్నారు. దానిని పుల్లర్ సాయంతో బయటకు తీశారు. మైక్రోపోన్స్, షర్ట్ బటన్ వద్ద స్పై కెమెరా కూడా పెట్టుకున్నారు. ఇలా నలుగురు హైటెక్ కాపీ చేసి.. పట్టుబడ్డారు. ఒకతని నుంచి బ్లూ టూత్ తీసే వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతుంది. ఇంకేముంది నెటిజన్లు కామెంట్లతో ఏకీపారేస్తున్నారు. వీళ్లు మాములొళ్లు కాదురా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
పరీక్ష (exam) హాల్లోకి పంపించే సమయంలో ముందే చెక్ చేస్తారు. మొబైల్స్, ప్యాడ్.. ఇతరత్రా అనుమతించారు. వీరు బ్లూటూత్, మెక్రో ఫోన్ పెట్టుకొని దర్జాగా వెళ్లారు. ఇంకా నయం.. పరీక్ష పూర్తవక ముందే చెక్ చేశారు. లేదంటే వారు చక్కగా ఎగ్జామ్ రాసి ఇంటికి వెళ్లిపోయేవారు.
#WATCH: Four individuals were apprehended during the #SRPF exam in #Pune for using hi-tech cheating tactics, including Bluetooth microphones in their ears and spy cameras in shirt buttons. pic.twitter.com/4Y1VXCYJh5