Ex Minister Narayana: మాజీమంత్రి నారాయణపై (Ex Minister Narayana) ఆయన తమ్ముడి భార్య ప్రియ సంచలన ఆరోపణలు చేశారు. నారాయణ తనను వేధించాడని వివరించారు. నారాయణ కబంధ హస్తల్లో చిక్కిన పిట్టను తాను అని బాధను వెళ్లగక్కారు. తన బావకు ఇద్దరు భార్యలు అని చెప్పారు. అయినప్పటికీ తనను వేధించేవాడని చెప్పారు. నవ్వుతూ స్టార్ట్ చేసిన వీడియో.. ఏడుస్తూ ముగించారు. 12.35 నిమిషాల వీడియోలో తన పెళ్లి సంబంధం కుదిరినప్పటీ నుంచి నిన్నటి వరకు జరిగిన క్రమాన్ని పూసగుచ్చినట్టు వివరించారు.
నరకం అనుభవించా..
పెళ్లి జరిగినప్పటీ నుంచి తనకు నరకం మొదలైందని పేర్కొన్నారు. నారాయణ (Narayana) డేగలా తనను హరాస్ చేశాడని చెబుతున్నారు. చిన్న వయస్సులో పెళ్లి కావడంతో.. ఆ వేధింపులు తెలియలేదని, తన పుట్టింటి వారికి చెప్పలేదని వివరించారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5, 6 గంటల వరకు తనను తిట్టేవారని తన గోడును వెళ్లబోసుకున్నారు. ఒకసారి తనను కొట్టేందుకు కూడా వచ్చాడని లోపలి నుంచి వస్తోన్న దు:ఖాన్ని ఆపుకొని మరీ వెల్లడించారు.
మరదలిని కొట్టి
తన భర్త (husband) హాచరీస్ కంపెనీలో పనిచేసే వారని.. రాత్రిపూట లేట్ వచ్చేవారని.. అప్పటివరకు అత్త మామ వద్ద పడుకునేదానిని వివరించారు. ఓ రోజు రాత్రి 12 గంటలకు ఇంటర్ కామ్ ద్వారా ఫోన్ చేసి, ఆకలి అవుతుందని పైకి భోజనం తేవాలని కోరారు. రెండో భార్య ఇందిర అక్క ఉండగా తనను భోజనం తేవాలని కోరగా.. తనకు భయం రానని చెప్పానని వివరించారు. కిందకి రావాలని.. రాకుంటే పదే పదే ఫోన్ చేశారని గుర్తుచేశారు. కిందకి వచ్చి తనను కొట్టాడని.. తన మామయ్య గట్టిగా చెప్పడంతో పైకి వెళ్లిపోయాడని తెలిపారు.
టీడీపీ నేత మాజీ మంత్రి నా మీద కన్నేశాడు అంటూ సంచలన అరోపణలు చేస్తూ వీడియో విడుదల చేసిన నారాయణ తమ్ముడి భార్య మణి ప్రియ#Narayanapic.twitter.com/PQGarArRA2
తమ్ముడికి చెప్పు
నారాయణ (narayana).. ప్రియతో నీకు ఏమైనా సమస్య ఉంటే.. తమ్ముడు మణికి చెప్పాలని.. నువ్వెవరు ఆమెను కొట్టడానికి అని మామ అన్నాడని వివరించారు. దీంతో నారాయణ వెళ్లిపోయాడని.. ఇదీ ఒక స్టోరీ.. మరో స్టోరీ మళ్లీ చెబుతానని ప్రియ తెలిపారు. అతనికి ఇద్దరు భార్యలు ఉండగా.. తానే కాఫీ ఇవ్వాలని, టిఫిన్ పెట్టాలని.. భోజనం వడ్డించాలని.. నిమిష, నిమిషం టార్చర్ పెట్టారని ఏడుస్తూ తన బాధను వెళ్లగక్కారు.