Ex Minister Malla Reddy Approached Telangana High Court
Ex Minister Malla Reddy: మాజీమంత్రి మల్లారెడ్డిపై ( Malla Reddy) శామీర్ పేట పోలీసు స్టేషన్లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. కేతావత్ భిక్షపతి అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఆ ఇష్యూపై మల్లారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. శామీర్ పేటలో తనపై నమోదైన కేసును క్వాష్ చేయాలని కోరారు. ఈ కేసును హైకోర్టు ధర్మాసనం విచారించాల్సి ఉంది.
ఏం జరిగిందంటే..?
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మూడుచింతలపల్లి మండలం కేశవరం గ్రామ పరిధిలో గల సర్వే నంబర్లు 33, 34, 35లో 47 ఎకరాల 18 గుంటల భూమి రాజీ అనే మహిళ పేరు మీద ఉంది. ఆమెకు భిక్షపతి సహా ఏడుగురు వారసులు ఉన్నారు. వారసత్వంగా చెందాల్సిన భూమి, తిరిగి తమ ఆధీనంలోకి వచ్చేలా చేస్తామని చెప్పి, మూడు చింతలపల్లి తహశీల్దార్ సమక్షంలో పీటీ సరెండర్ చేశారని బాధితులు చెబుతున్నారు.
డిసెంబర్ 6వ తేదీన మల్లారెడ్డిపై చీటింగ్, అట్రాసిటీ కేసు నమోదు చేశారు. తమకు భూమి ఇప్పిస్తామని చెప్పి.. ప్రభుత్వానికి సరెండర్ చేశారని బిక్షపతి చెబుతున్నారు. మల్లారెడ్డితోపాటు శ్రీనివాస్ రెడ్డి, హరిమోహన్ రెడ్డి, మధూకర్ రెడ్డి, శివుడు, స్నేహా రామిరెడ్డి, రామిడి లక్ష్మమ్మ, రామిడి నేహారెడ్డిపై కేసు పెట్టారు. ఆ కేసును కొట్టివేయాలని మల్లారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.
ఆ కేసు నమోదు చేసింది కాంగ్రెస్ పార్టీ కాదని.. సభలో సభ్యులు తక్కువగా ఉంటే కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తామని మల్లారెడ్డి అన్నారు. దీనిని బట్టి చూస్తే.. మల్లారెడ్డి వీలైనంత త్వరగా పార్టీ మారే అవకాశం ఉంది.