»If Congress Does Not Implement 6 Guarantees In 100 Days We Will Show Gangula Kamalkar
Gangula Kamalkar: కాంగ్రెస్‌కు 100 రోజుల డెడ్ లైన్.. తర్వాత ఏం చేస్తామంటే..?
హామీలు ఇచ్చి వదిలేస్తే ఊరుకునేది లేదని, ఇచ్చిన 6 గ్యారంటీలకు 100 రోజులు గడువు ఇస్తున్నాము, ఆ తరువాత అమలు చేయకపోతే రోడ్డెక్కుతామని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీకి పోరాటాలు కొత్తేమి కాదని హెచ్చరించారు.
If Congress does not implement 6 guarantees in 100 days, we will show.. Gangula Kamalkar
Gangula Kamalkar: ఎన్నికల్లో ఉచిత హామీలు ఎన్నో ఇచ్చారు. వాటిని నమ్మి ప్రజలు కాంగ్రెస్(Congress)ను గెలిపించారు. ఇచ్చిన హామీలన్నింటిలో ముందు ఆరు గ్యారంటీల(6 guarantees) అమలు చేయాలని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్(Gangula Kamalkar) అన్నారు. దాని కోసం వందరోజుల గడువు ఇస్తామని పేర్కొన్నారు. ఆ తరువాత ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే బీఆర్ఎస్ పార్టీ అంటే ఏంటో చూపిస్తామని అన్నారు. కాంగ్రెస్‌కు నిరసన సెగ తాకుతాయని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మంగళవారం కరీంనగర్లో మీడియాతో మాట్లాడారు.
కరీంనగర్(Karimnagar) చరిత్రలో వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, దీనికి కారకులైన నియోజకవర్గ ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటానని వెల్లడించారు. పదిహేనేళ్ల కాలంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా కరీంనగర్‌ను గొప్పగా అభివృద్ధి చేశానని చెప్పారు. కరీంనగర్ ప్రజల కోసమే తన జీవితాన్ని అంకితం చేస్తున్నట్లు తెలిపారు. సాధించుకున్న తెలంగాణలో ఏర్పడిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో గొప్ప పనులు చేసిందని పేర్కొన్నారు. వ్యవసాయం దండగ అన్నవారే వ్యవసాయాన్ని పండగలా చేసుకుంటున్నారని, వలసలు తగ్గాయని, ప్రతి పల్లెకు నీరు అందిందని వెల్లడించారు. ప్రభుత్వం ఎప్పుడూ ప్రజల పక్షంగా ఉంటూ వారి అవసరాల తగ్గట్టు పనిచేయాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే చూస్తూ కూర్చోలేమని, పోరాటాలు బీఆర్ఎస్కు కొత్త కాదని తెలిపారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే రోడ్డెక్కి కొట్లాడుతామని స్పష్టంచేశారు.