»Negotiations With Junior Doctor Successful No Strike Damodar Rajanarsimha
Damodar Rajanarsimha: జూడాలతో చర్చలు ఫలించాయి.. ఇక సమ్మె లేదు
జూనియర్ డాక్టర్లతో వైద్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ జరిపిన చర్చలు ఫలించాయి. వారికి ప్రతి నెల 15 వ తేదీ లోపు స్టైఫండ్ రిలీజ్ చేస్తామని మంత్రి హామీ ఇవ్వడంతో సమ్మె చేయడం లేదని స్పష్టం చేశారు.
Negotiations with junior doctor successful.. No strike.. Damodar Rajanarsimha
Damodar Rajanarsimha: జూనియర్ డాక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన చర్చలు ఫలించాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. వారికి స్టైఫండ్ రావడం లేదని, అలాగే హస్టల్లో తగిన సౌకర్యాలు లేవని తదిర అంశాలపై జూడాలు సమ్మె చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో మంత్రి దామోదర రాజనర్సింహ మంగళవారం జూనియర్ డాక్టర్లతో సుదీర్ఘ చర్చలు జరిపారు. ఇక నుంచి ప్రతి నెల 15వ తేదీ లోపు స్టైఫండ్ రిలీజ్ చేస్తామని హామీ ఇచ్చారు. వారి అన్ని సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని చెప్పారు. ప్రభుత్వం తరుఫున మంత్రి హామీ ఇవ్వడంతో జూడాలు సమ్మె చేయాలనే ఆలోచనను విరమించుకున్నట్లు ప్రకటించారు.
రెండు నెలల్లో కొత్త ఉస్మానియా ఆసుపత్రి భవనానికి శంకుస్థాపన చేస్తామని మంత్రి తెలిపినట్లు, పెరిగిన సీట్లకు అనుగుణంగా హాస్టల్ సదుపాయం కూడా కలిపిస్తామనే హమీలు దామోదర రాజనర్సింహ ఇచ్చారని జూడాలు వెల్లడించారు. స్టేట్ వైడ్గా డీఎన్బీ 46 మంది ఉన్నారు, వారందరికి స్టైఫండ్ ఇస్తామని హామీ ఇవ్వడంతో జూడాలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.