»Ex Minister Srinivas Goud Office Furniture Export Student Union Leaders Protest
Srinivas Goud: ఆఫీస్‌లో ఫర్నిచర్ తరలింపు..అడ్డుకున్న విద్యార్థి సంఘ నేతలు
హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో మాజీ మంత్రి ఆఫీసులో ఉన్న ఫర్నిచర్, కంప్యూటర్ సహా పలు వస్తువులను తరలిస్తున్న క్రమంలో ఓయూ విద్యార్థి సంఘం నాయకులు వారిని అడ్డుకున్నారు. ప్రభుత్వ ఆస్తులను అలా ఎలా తీసుకెళ్తారని నిరసన తెలిపారు.
ex minister Srinivas Goud office furniture export Student union leaders protest
హైదరాబాద్(hyderabad) లోని రవీంద్రభారతి(ravindra bharathi)లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కార్యాలయంలోని ఫర్నీచర్, కంప్యూటర్లు, ఇతర వస్తువులను తీసుకెళ్తున్నారు. అయితే ఈ విషయం తెలిసిన ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) విద్యార్థి సంఘం నాయకులు, ఇతర విద్యార్థులు వాటిని అడ్డుకున్నారు. ప్రభుత్వ ఆస్తులను తీసుకెళ్లేందుకు అనుమతి లేదని అన్నారు. ఈరోజు ఉదయం రెండు ట్రాలీల్లో ఫర్నీచర్, కంప్యూటర్లు, ఇతర వస్తువులను తీసుకెళ్లే ప్రయత్నం చేయగా.. ప్రభుత్వానికి సంబంధించిన సరుకులు ఎలా తరలిస్తారంటూ విద్యార్థులు నిరసనకు దిగారు. ట్రాలీ ఆటోలను అడ్డుకున్నారు.
శ్రీనివాస్ గౌడ్(Srinivas Goud) మనుషులను అక్రమంగా తరలిస్తున్నారని విద్యార్థి సంఘం నాయకులు ధర్నాకు దిగారు. దీంతో సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు నమోదు చేయడం విశేషం. ట్రాలీ డ్రైవర్ ఈ ఫర్నిచర్‌ను నాంపల్లిలోని టీజీఓ భవన్‌కు తరలిస్తున్నాడు. లోడ్‌లో ఏసీ, ఫర్నీచర్, కంప్యూటర్లు సహా అనేక ఫైళ్లు తరలించినట్లు విద్యార్థులు గుర్తించారు. ఈ వార్త ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మంత్రి స్థాయిలో ఉన్నా కూడా ఇటివల అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన శ్రీనివాస్ రెడ్డి మళ్లీ తన ఆఫీసులో ప్రభుత్వం సమకూర్చిన ఫర్నిచర్ కూడా తీసుకెళ్లడం పట్ల విద్యార్థులు పలు రకాలుగా కామెంట్లు(comments) చేస్తున్నారు.