»Nalgonda Congress Leader Son Killed His Wife And Tried To Convince Heart Attack
Crime: భార్యను హత్య చేసిన కాంగ్రెస్ నేత కుమారుడు!
సినీయర్ కాంగ్రెస్ నేత కుమారుడు తన భార్యను చంపి గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. కానీ యువతి తల్లిదండ్రులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోస్ట్మార్టం నిర్వహించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Nalgonda, Congress leader son killed his wife and tried to convince heart attack
Crime: భార్యను చంపేసి ఆపై గుండెపోటు(Heart Attack)గా చిత్రికరీంచిన సీనియర్ కాంగ్రెస్ నేత(Congress Leader) కుమారుడు. పోస్ట్మార్టం రిపోర్టుతో అసలు విషయం వెలుగులో వచ్చిన ఈ ఘటన నల్గొండ(Nalgonda) జిల్లాలో చోటుచేసుకుంది. నల్గొండ జిల్లా నిడమనూరుకు చెందిన కాంగ్రెస్ లీడర్ ఎవడల్లి రంగసాయి రెడ్డి కుమారుడు వల్లబ్ రెడ్డికి గత ఏడాది పెళ్లైంది. ఇద్దరి మధ్య గొడవలు ఏంటన్నది తెలియదు. కానీ కట్టుకున్న భార్యను చంపేశాడు. ఆ హత్యను గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. ఇప్పుడిప్పుడే రాజకీయాల్లో చురుకుగా వ్యవహరిస్తున్న వల్లబ్ తన పలుకుబడిని ఉపయోగించుకోవాలని అనుకున్నాడు. కానీ పోస్ట్మార్టంలో అసలు నిజాలు బయటకు వచ్చాయి.
గుండెపోటుతో చనిపోలేదని శరీరం లోపల తీవ్ర స్థాయిలో గాయాలు అయ్యాయని నివేదికలో తేలింది. తన భార్య కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు మేరకు నారయణగూడ పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. ఆ క్రమంలో నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. అయితే తానే హత్య చేసి సాక్షాలు చెరిపేసినట్లుగా పోలీసులు నిర్దారించారు. నిందితుడిపై సెక్షన్ 201, 302 కింద హత్యకేసు పెట్టారు. అయితే చంపాడానికి కారణాలు ఏంటి? ఎలా చేశాడు అన్న విషయాలు తెలియాల్సి ఉంది.