Bhupalapally BRS Ticket To Give Sirikonda Workers Are Demand
BRS Ticket: అధికార బీఆర్ఎస్ (BRS) పార్టీలో టికెట్ల గొడవ మొదలైంది. కొన్ని నియోజకవర్గాల్లో సిట్టింగుల మార్పు అనే ఊహాగానాలు జోరుగా జరుగుతున్నాయి. దీంతో ఎమ్మెల్యేలకు భయం పట్టుకుంది. తమ శక్తిమేరకు లాబీయింగ్ చేస్తున్నారు. కొన్ని చోట్ల గెలిచిన అభ్యర్థులు.. బీఆర్ఎస్ పార్టీలోకి రావడంతో ఓడిన నేతల టికెట్ల విషయంలో అయోమయం నెలకొంది. గత ఎన్నికల్లో భూపాలపల్లి నుంచి బీఆర్ఎస్ నుంచి బరిలోకి దిగిన మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనచారి (sirikonda madhusudhana chary) ఓడిపోయారు. గెలిచిన గండ్ర వెంకట రమణారెడ్డి (gandra venkata ramana reddy) బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చాడు. సో.. ఇప్పుడు టికెట్ విషయమై డిస్కషన్స్ జరుగుతున్నాయి.
బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గండ్ర వెంకట రమణారెడ్డి.. మరోసారి టికెట్ ఆశిస్తున్నారు. ఆయనకు టికెట్ కన్ఫామ్ అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో పోచారం అనుచరులు ఆందోళనకు గురవుతున్నారు. ఇన్ని రోజులు పార్టీకి సేవ చేస్తే.. ఈ సారి టికెట్ లభించదా అనే సందేహాం వెంటాడుతోంది. నిన్న కొందరు ఆ పార్టీ యువకులు వినూత్నంగా నిరసన తెలిపారు. సెల్ టవర్ ఎక్కి మరీ నిరసనకు దిగారు.
బీఆర్ఎస్ పార్టీలో టికెట్ల లొల్లి.. భూపాలపల్లిలో టవరెక్కిన యువకులు
భూపాలపల్లి టికెట్ ఈసారి గండ్ర వెంకటరమణ రెడ్డికి కాకుండా ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారికి ఇవ్వాలంటూ కొందరు యువకులు సెల్ టవర్ ఎక్కారు. pic.twitter.com/gWKGPRV4Q3
వచ్చే ఎన్నికల్లో భూపాలపల్లి నుంచి సిరికొండకు (sirikonda) టికెట్ ఇవ్వాలని అంటున్నారు. గండ్రకు టికెట్ ఇవ్వొద్దని కోరుతున్నారు. పార్టీ కోసం సిరికొండ చాలా చేశారని గుర్తుచేస్తున్నారు. గండ్రకు టికెట్ ఇచ్చి అన్యాయం చేయొద్దని అడిగారు.. బీఆర్ఎస్ నేతల నిరసన సెగ హైకమాండ్‌కు తాకుతుందెమో చూడాలి.