»Bcci Is Serious About Kohli And Gambhir Both Are Fined Heavily
Kohli Vs Gambhir: కోహ్లీ, గంభీర్‌పై బీసీసీఐ సీరియస్..ఇద్దరికీ భారీ జరిమానా
కోహ్లీ, గంభీర్ కు బీసీసీఐ భారీ జరిమానాను విధించింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు కోహ్లీ, గంభీర్ (Gowtham Gambhir) లకు మ్యాచ్ ఫీజులో 100 శాతం కోత విధిస్తున్నట్లు ప్రకటించింది.
ఐపీఎల్ 2023(IPL 2023) సీజన్లో ప్రతి మ్యాచూ ఉత్కంఠభరితంగా సాగుతోంది. నిన్న జరిగిన ఆర్సీబీ(RCB), లక్నో(Lucknow) జట్ల మ్యాచ్ గురించి నెట్టంట చర్చ నడుస్తోంది. విరాట్ కోహ్లీ(Virat Kohli), గౌతమ్ గంభీర్(Gowtham Gambhir) మధ్య వాగ్వాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. గతనెల 10వ తేదిన ఆర్సీబీ, లక్నో మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్ లో విరాట్, గంభీర్ మధ్య మాటల యుద్ధం నడిచింది. నిన్న కూడా ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరగ్గా మరో వివాదం చెలరేగింది. లక్నో బౌలర్ నవీన్ ఉల్ హక్, అమిత్ మిశ్రాలతో కోహ్లీ గొడవకు దిగడం చర్చనీయాంశమైంది.
మ్యాచ్ తర్వాత గంభీర్(Gowtham Gambhir) , కోహ్లీ(Virat Kohli) మధ్య మైదానంలోనే వాగ్వాదం జరిగింది. ఇద్దరూ ఒకరిపైకి మరొకరి దూసుకెళ్లడంతో ఆయా జట్ల సభ్యులు వారిద్దరినీ పక్కకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయినా కూడా వారు మళ్లీ ఒకరినొకరు తిట్టుకుంటూ గ్రౌండ్ లో కనిపించారు. ప్రస్తుతం వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్(Video Viral) అవుతున్నాయి.
వాగ్వాదం తర్వాత లక్నో కెప్టెన్ రాహుల్ కు కోహ్లీ(Virat Kohli) జరిగిన విషయాన్ని చెప్పాడు. ఆ టైంలో కోహ్లీకి క్షమాపణలు చెప్పాలని నవీన్ కు రాహుల్ ఆదేశించారు. అయితే నేనెందుకు క్షమాపణలు చెప్పాలి అన్నట్లుగా నవీన్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వరుస ఘటనల నేపథ్యంలో కోహ్లీ, గంభీర్ కు బీసీసీఐ భారీ జరిమానాను విధించింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు కోహ్లీ, గంభీర్ (Gowtham Gambhir) లకు మ్యాచ్ ఫీజులో 100 శాతం కోత విధిస్తున్నట్లు ప్రకటించింది. అలాగే లక్నో బౌలర్ నవీన్ ఉల్ హక్ కు కూడా మ్యాచ్ లో 50 శాతం ఫీజు కోత విధిస్తూ నిర్ణయం తీసుకుంది.