buried alive : వృద్ధుడిని సజీవంగా పాతిపెట్టాడు.. నాలుగు రోజుల తర్వాత బయటకి!
పదహారేళ్ల యువకుడు ఓ వృద్ధుడిని భూమి లోపల సజీవంగా పాతిపెట్టాడు. నాలుగు రోజుల తర్వాత మూలుగులు విన్న పోలీసులు నేలను తవ్వి అతడిని వెలికి తీశారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది.
Man Buried Alive : మానవత్వం కరువై మృగాల్లో మనుషులు వ్యవహరిస్తున్న ఘటనలు రాను రాను ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఓ వృద్ధుడిని(Old Man) ఓ యువకుడు సజీవంగా మట్టిలో పాతి పెట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. యూరప్ ఖండంలోని మాల్డొవా(moldova) దేశంలో ఈ ఘటన జరిగింది. పద్దెనిమిదేళ్ల యువకుడు ఈ పని చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడున్నాయి.
మాల్డోవాలోని ఓ ఇంట్లో 74 ఏళ్ల వృద్ధురాలు మరణించి ఉన్నట్లు స్థానికులు గమనించారు. దీంతో ఆమె బంధువులు ఈ విషయమై పోలీసులకు సమాచారం అందించారు. అది దర్యాప్తు చేయడానికి ఆ వృద్ధురాలి ఇంటికి పోలీసులు చేరుకున్నారు. ఆమె గాయాలపాలై మృతి చెంది ఉంది. ఆ ఇంటికి దగ్గరలో భూమి నుంచి మూలుగులు వినిపించడం గమనించారు. నేల మాళిగలోకి వెళ్లే ప్రవేశ మార్గం మట్టితో కప్పి ఉండటం చూశరు. దీంతో పోలీసులకు లోపల ఎవరో ఉన్నారని అనుమానం కలిగింది. వేగంగా అక్కడున్న మట్టిని తొలగించి చూసేసరికి లోపల ఓ వృద్ధుడు ఉన్నాడు. అతడిని సురక్షితంగా బయటకు తీశారు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
బయటకు వచ్చిన తర్వాత వృద్ధుడు కొన్ని వివరాలు వెల్లడించాడు. తాను పదహారేళ్ల యువకుడితో కలిసి మద్యం తాగినట్లు తెలిపాడు. మాటల మధ్య తాము ఇద్దరికీ వాగ్వాదం జరిగిందన్నాడు. దీంతో తనను యువకుడు కొట్టి నేల మాళిగలో వేసి జీవ సమాధి చేశాడని తెలిపాడు. దీంతో వృద్ధురాలిని కూడా అతడే హత్య చేసి ఉండొచ్చన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సమాధిని తవ్వి వృద్ధుడిని వెలికి తీసిన వీడియో ప్రస్తుతం నెట్లో వైరల్గా మారింది.