ఖమ్మం: అధిక పని ఒత్తిడితో సతమతం అవుతున్నామని బుధవారం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు వ్యవసాయ విస్తరణ అధికారులు వినతి పత్రం సమర్పించారు. రైతుబంధు, రైతుబీమా, పీఎం కిసాన్, పంట నష్టం సర్వేలు, పంట కోత ప్రయోగాలు వంటి 49 రకాల పనులను నిర్వర్తిస్తున్నామని చెప్పారు. క్లస్టర్ లిమిట్ తగ్గించి పని భారం తగ్గించాలని, గ్రామానికి వ్యవసాయ సహాయకులను నియమించాలన్నారు.