NLG: వలిగొండ మండల కేంద్రంలోని గురువారం ప్రభుత్వం మత్స్యశాఖ ఆధ్వర్యంలో అక్క చెల్లెల్ల చెరువులో ఉచిత చేప పిల్లలను పంపీణీ చేశారు. భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పంపీణీలో పాల్గొని చేప పిల్లలను చెరువులో వదిలారు. ఆయన మాట్లాడుతూ.. మత్స్యకారుల అభి వృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, నాయకులు పాల్గొన్నారు.