NGKL: నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో అదనపు గదుల నిర్మాణానికి ఆయన గురువారం భూమి పూజ నిర్వహించి, శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి అనేక కార్యక్రమాలు చేపట్టిందని గుర్తు చేశారు.