SRCL: జిల్లాలోని ఫుడ్ ఇన్స్పెక్టర్ జాడ పత్తా లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. జిల్లాతో పాటు పలు మండలాలు, గ్రామాలలో టిఫిన్ సెంటర్లు, హోటల్లు, బేకరీలు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లు, బిర్యానీ సెంటర్లు, వాణిజ్య సముదాయంలో తినుబండారాల తనిఖీలు చేయడం లేదని ఆరోపించారు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా కల్తీలకు పాల్పడుతూ అధిక ధరలకు విక్రయిస్తున్నారు.