AP: ప్రజా సమస్యల పరిష్కారానికి అసలైన వేదిక అసెంబ్లీ అని ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు శాసనసభను వినియోగించుకోవట్లేదని విమర్శించారు. వైసీపీ అధినేత జగన్ శాసన సభను అవమానిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వకుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. ఏ ప్రతిపక్ష హోదా ఉందని వైసీపీ ఎంపీలు పార్లమెంట్‌కు వెళ్తున్నారని నిలదీశారు.