AP: సీఎం చంద్రబాబు పల్నాడు జిల్లా పర్యటన ఈ నెల 31కి మారింది. తొలుత జనవరి 1న గురజాల మండలం పులిపాడులో సీఎం పర్యటించనున్నట్లు అధికారులు తెలిపారు. అయితే, ఆ పర్యటన ఇప్పుడు ఈ నెల 31కి మారింది. ఆ రోజు ఆయన నరసరావుపేట మండలం యల్లమందలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారని కలెక్టర్ అరుణ్‌బాబు పేర్కొన్నారు.