VZM: అనంతగిరి మండలం, డముకు గ్రామంలో మాజీ మంత్రి, గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ ఛైర్మన్ కిడారి శ్రావణ్, లోక్ సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బీశెట్టి బాబ్జీల చేతుల మీదుగా 100 దుప్పట్లు నిరుపేద గిరిజనులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం విజయనగరం జిల్లా మదర్ థెరిసా సేవా సంఘం అధ్యక్షులు త్యాడ ప్రసాద్ పట్నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించారు.