NDL: సంజామల మండలం మిక్కినేనిపల్లెలో శుక్రవారం తహసీల్దార్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. పలు భూ సమస్యలపై అర్జీలు స్వీకరించామని, త్వరలో వాటిని పరిష్కరిస్తామని తహసీల్దార్ అనిల్ స్పష్టం చేశారు. TDP నేతలు మునగాల రామిరెడ్డి, శ్రీధర్ రెడ్డి, బెలుం సుదర్శన్ రెడ్డి, సర్వేయర్లు కృష్ణయ్య, శ్రీనివాస్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.