బాక్సింగ్ డే టెస్టులో తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డి సూపర్ ఫిఫ్టీ(54*) సాధించాడు. 6 వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చిన నితీష్.. 4 ఫోర్లు, సిక్సర్ సాయంతో హాఫ్ సెంచరీ సాధించాడు. నితీష్ గత మ్యాచుల్లో 40 ప్లస్ పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఎట్టకేలకు ఇవాళ టెస్టుల్లో తన మొదటి హాఫ్ సెంచరీ సాధించాడు. ప్రస్తుతం భారత్ స్కోర్ 274/7.