TG: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపట్ల మాజీ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘మన్మోహన్సింగ్ ఉన్నత శిఖరాలను చేరుకున్న భరతమాత ముద్దు బిడ్డ. మన్మోహన్సింగ్ హాయాంలోనే తెలంగాణ ఏర్పాటు జరగడం చారిత్రక సందర్భం. మన్మోహన్ సింగ్ మరణం భారతదేశానికి తీరని లోటు’ అని పేర్కొన్నారు. మరోవైపు మన్మోహన్ మృతిపట్ల కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంతాపం తెలిపారు.