AP: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపట్ల మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంతాపం తెలిపారు. మన్మోహన్ సింగ్ ఆత్మకు శాంతి కలగాలని కోరారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మరోవైపు మన్మోహన్ మృతిపట్ల మంత్రి లోకేశ్ సంతాపం తెలిపారు. మన్మోహన్ సింగ్ మృతి దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారు.