మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపట్ల ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ సంతాపం తెలిపారు. ‘మన్మోహన్ మరణం చాలా బాధాకరం. దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టంగా మార్చిన ఆర్థికవేత్త మన్మోహన్. దేశంలో ఆర్థిక సంస్కరణల రూపశిల్పి మన్మోహన్. ధైర్యంగా మన దేశాన్ని క్లిష్టమైన పరివర్తనవైపు నడిపించారు. దేశాభివృద్ధి శ్రేయస్సు కోసం కొత్త మార్గాలను తెరిచారు’ అని పేర్కొన్నారు.