AP: రాష్ట్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణకు CM చంద్రబాబు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే మంత్రిగా నాగబాబు పేరు ఖరారు కాగా.. తాజాగా TDP రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ను కూడా కేబినెట్లోకి తీసుకుంటున్నట్లు సమాచారం. బాధ్యతలను సరిగా నిర్వర్తించని ఓ మంత్రిని తొలగించి పల్లాకు అవకాశం ఇవ్వనున్నారట. కాగా, జనవరి 8న మంత్రులుగా నాగబాబు, పల్లా ప్రమాణం చేయనున్నట్లు తెలుస్తోంది. .