ASR: చింతపల్లి మండలం అన్నవరం సంతపాకలు వద్ద మద్యం అధికంగా సేవించిన ఓ వ్యక్తి మృతి చెందాడు. చోడిరాయి గ్రామానికి చెందిన మువ్వల నాగేశ్వరరావు అనే వ్యక్తి గురువారం రాత్రి మద్యం అధికంగా సేవించాడు. మద్యం మత్తులో సంతపాకలు వద్ద పడుకున్నాడు. అయితే చలి తీవ్రతకు శుక్రవారం ఉదయానికి మృతి చెందాడు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారని అన్నవరం ఎస్సై వీరబాబు తెలిపారు.