అన్నమయ్య: వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు విద్యుత్ ఛార్జీలపై పోరుబాట కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రైల్వేకోడూరు పట్టణంలోని రాజ్ కన్వెన్షన్ నుండి ఏపీఎస్పీడీసీఎల్ విద్యుత్ కార్యాలయం వరకు మాజీశాసనసభ్యులు కోరముట్ల శ్రీనివాసులు వైసీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి భారీగా ర్యాలీ చేపట్టారు. అనంతరం విద్యుత్ ఏడికి వినతిపత్రం సమర్పించారు.