హూతీలపై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. హూతీ తిరుగుబాటుదారుల మౌలిక సదుపాయాలే లక్ష్యంగా యెమెన్ రాజధాని సనాతో పాటు హోదైదాపై దాడులు చేసింది. సనాలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉన్న హూతీలకు చెందిన మౌలిక సదుపాయాలు, విద్యుత్ కేంద్రాలతో పాటు అల్-సలీఫ్, రాస్ ఖాంటిబ్లోని ఓడరేవులపై ఒకే సమయంలో దాడి చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది.