ప్రభుత్వరంగ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ రూ.61,000 కోట్ల పెట్టుబడులతో ఒడిశాలోని పరదీప్లో నాఫ్తా క్రాకర్ ప్రాజెక్టును ఏర్పాటు చేయనుంది. ఇందుకు సంబంధించి జనవరిలో జరిగే ‘ఉత్కర్ష్ ఒడిశా–మేక్ ఇన్ ఒడిశా 2025’ సదస్సులో ఐవోసీఎల్, ఒడిశా ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదరనుంది. ఈ మేరకు ఒడిశా సీఎం కార్యాలయం ప్రకటించింది.