NLR: దుత్తలూరు మండలం సోమల రేగడలో తహసీల్దార్ యనమల నాగరాజు ఆధ్వర్యంలో గురువారం రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రైతుల నుంచి వివిధ భూ సమస్యలపై దరఖాస్తులు స్వీకరించారు. MRO మాట్లాడుతూ.. రైతులు సకాలంలో భూ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. అలాంటి సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరిస్తామని MRO తెలిపారు.