HYD: కుల్కచర్ల మండల కేంద్రంలో రత్నమాల కిరాణా షాప్ నడుపుతూ జీవనాన్ని కొనసాగిస్తుంది. ఆదివారం గుర్తు తెలియని వ్యక్తి వచ్చి వాటర్ బాటిల్ అడగగా వాటర్ బాటిల్ ఇచ్చే క్రమంలో ఆమె మంగళ సూత్రం లాక్కునే ప్రయత్నం చేశాడు. అది తెగి క్రింద పడిపోయింది. ఆమె అరుపులు చేయడంతో దుండగుడు పరారయ్యాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.