NZB: కార్మిక శాఖ ద్వారా ఐటీఐలో శిక్షణ ఇవ్వనున్నట్టు కార్మిక శాఖ అధికారి ప్రభుదాస్ ఒక ప్రకటనలో తెలిపారు. భీంగల్ డివిజన్లోని భవన, ఇతర నిర్మాణ రంగాలలో పనిచేస్తున్న వారి పిల్లలకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. టెన్త్ అర్హత ఉన్న పిల్లలు శిక్షణకు అర్హులని అన్నారు. ఈ అవకాశాన్ని కార్మికులు వారి పిల్లలకు అందించి సద్వినియోగం చేసుకోవాలని కోరారు.