KMR: కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని ఉపాధి కల్పన కార్యాలయంలో ఈనెల 19న ఉద్యోగమేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి మధుసూదన్ తెలిపారు. ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు యువతీ యువకులు ఇంటర్వ్యూకు హాజరు కావాలని చెప్పారు. ముత్తూట్ ఫైనాన్స్ పోస్టులు ఉన్నాయని పేర్కొన్నారు. డిగ్రీ, పీజీ చదివిన వారికి అర్హత ఉంటుందన్నారు.