NLG: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మహర్షి వాల్మీకి జయంతి వేడుకలను గురువారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి. పూర్ణచంద్ర, అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయన్ అమిత్,స్పెషల్ కలెక్టర్, జిల్లా అధికారులు మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.