HYD: స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మాజీ ఛైర్మన్ ,శాసనమండలి మాజీ సభ్యులు ఇంద్రసేనారెడ్డి ఆదివారం తుది శ్వాస విడిచారు. అనారోగ్య కారణాలతో ఇటీవల సికింద్రాబాద్ యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతూ.. మరణించారు. ఆయన సుదీర్ఘంగా కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాలో సేవలు అందించారు. ఇంద్రసేనారెడ్డి మృతి పట్ల అంబర్‌పేటకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేతలు సంతాపం ప్రకటించారు.